Song Info
Starring : Indravati Chuhan, Mangli
Lyrics : SadaChandra
Music : Madeen SK

Gandhasiri Vanamali Lyrics

గంధసిరి వనమాలి (x4)

జారు జారు బండ మీద
జాము రాతిరి ఓ గంధసిరి వనమాలి
జోరు జోరు జాజిరాటలాడె పోకిరి
ఓ గంధసిరి వనమాలి

జారు జారు బండ మీద
జాము రాతిరి ఓ గంధసిరి వనమాలి
జోరు జోరు జాజిరాటలాడె పోకిరి
ఓ గంధసిరి వనమాలి

పిండారబోసినట్టు
ఎండీ ఎన్నెల్ల జల్లు,
నిండార నిన్ను సూడ
వద్దామంటే వాళ్ళు వీళ్ళు

పిండారబోసినట్టు
ఎండీ ఎన్నెల్ల జల్లు
నిండార నిన్ను సూడ
వద్దామంటే వాళ్ళు వీళ్ళు, ఊ ఊ

కాపు కాసి ఆపేస్తే రాకుంటినీ
ఓ గంధసిరి వనమాలి
బందిఖాన నన్ను జేస్తే బాధలుంటిని
ఓ గంధసిరి వనమాలి

జారు జారు బండ మీద
జాము రాతిరి ఓ గంధసిరి వనమాలి
జోరు జోరు జాజిరాటలాడె పోకిరి
ఓ గంధసిరి వనమాలి

గంధసిరి వనమాలి
గంధసిరి వనమాలి

సందులోకి వచ్చినావు
నన్ను మందలించి పోయినావు
సందెకాడ కల్సినావు
కొంటె సైగలేవో జేసినావు

సేను కాడ కల్సినావు
సెయ్యి సైగ జేసినావు
బాయి కాడ కల్సినావు
బంతిపూలు ఇచ్చినావు
పట్టు చీర కట్టి కొప్పులో మల్లెలెట్టి
కోరుకున్న పోరగాడా
ఆశ పడితి నిన్ను చేరా

ఒట్టు పెట్టుకోని
ఎదురు చూస్త ఉంటిని
గంధసిరి వనమాలి
కట్టుబాటు దాటి బయట రాకుంటిని
గంధసిరి వనమాలి

జారు జారు బండ మీద
జాము రాతిరి ఓ గంధసిరి వనమాలి
జోరు జోరు జాజిరాటలాడె పోకిరి
ఓ గంధసిరి వనమాలి

గంధసిరి వనమాలి(x2)

నా మనసులోన నిండి నీవు
నీ మనసు నాకు తెలిపినావు
నిన్ను మరిసి ఉండలేను
కలుసుకోగా నీవు రావా నన్ను

నాలుగురిట్ల జెయ్యకు
నన్నూ నవ్వుల పాలు
పదుగురిట్ల పందిట్ల పట్టుకో సిటికనేలు
ఒక్కపొద్దులుండి ముడుపులెన్నో గట్టి
జాగారాలు జేసినారా జల్ది వచ్చి ఏలుకోవా

మా ఇంటి వాళ్ళతో నువ్వు మాటలాడరా
గంధసిరి వనమాలి
జంట కట్టి సంబురాల్లో తేలుదామురా
గంధసిరి వనమాలి

జారు జారు బండ మీద
జాము రాతిరి ఓ గంధసిరి వనమాలి
జోరు జోరు జాజిరాటలాడె పోకిరి
ఓ గంధసిరి వనమాలి

Listen Gandhasiri Vanamali Song