Track Info
Lyrics : Chandrabose
Singer : Indravati Chauhan
Music : Devi Sri Prasad
Starring : Allu Arjun, Rashmika, Samantha

Oo Antava Oo Oo Antava Lyrics in Telugu

కోక కోక కోక కడితే
కొరకొరమంటు చూస్తారు
పొట్టి పొట్టి గౌనే వేస్తే
పట్టి పట్టి చూస్తారు

కోకా కాదు గౌను కాదు
కట్టులోన ఏముంది
మీ కళ్ళల్లోనే అంతా ఉంది
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా

తెల్లా తెల్లాగుంటె ఒకడు
తల్లాకిందులౌతాడు
నల్లా నల్లాగుంటె ఒకడు
అల్లారల్లరి చేస్తాడు

తెలుపు నలుపు కాదు
మీకు రంగుతో పనియేముంది
సందు దొరికిందంటే సాలు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా

హాయ్ ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా

ఎత్తూ ఎత్తూగుంటే ఒకడు
ఎగిరి గంతులేస్తాడు
కురసా కురసాగుంటే ఒకడు
మురిసి మురిసిపోతాడు

ఎత్తూ కాదు కురసా కాదు
మీకో సత్యం సెబుతాను
అందిన ద్రాక్షే తీపి మీకు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా
హాయ్ ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా

బొద్దూ బొద్దూ గుంటే ఒకడు
ముద్దుగున్నావంటాడు
సన్నా సన్నంగుంటే ఒకడు
సరదాపడి పోతుంటాడు

బొద్దూ కాదు సన్నం కాదు
ఒంపు సొంపు కాదండి
ఒంటిగ సిక్కామంటే సాలు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా
హాయ్ ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా

పెద్దా పెద్దా మనిషిలాగ
ఒకడు ఫోజులు కొడతాడు
మంచి మంచి మనసుందంటూ
ఒకడు నీతులు సెబుతాడు

మంచీ కాదు సెడ్డా కాదు
అంతా ఒకటే జాతండి
దీపాలన్నీ ఆర్పేసాకా
ఊ ఊ ఊ ఊ దీపాలన్నీ ఆర్పేసాకా
అందరి బుద్ధి వంకర బుద్ధే

ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా
ఊ అంటామే పాప
ఊ ఊ అంటామా పాప

ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా
ఊ అంటామే పాప
ఊ హు అంటామా పాప

ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా

Listen Oo Antava Song